PODUPU KATHALU

PODUPU KATHALU IN TELUGU │ Page-3

61. ముక్కు మీద‌కెక్కు, ముదుర చెక్కుల నొక్కు,
 ట‌క్కు నిక్కుల సొక్కు జారిందో పుటుక్కు ఏమిట‌ది?

క‌ళ్ల‌జోడు

62. రేట్లెంత పెరిగినా ఎప్పుడూ పది పైసలకు రెండు వొచ్చేవి?

రెండు ఐదు పైసల బిళ్ళలు

63. తోలు న‌లుపు, తింటే పులుపు, ఏంటో అది?

చింత‌పండు

64. వాలు కాని వాలు, ఏమి వాలు?

ఆనవాలు

65. కుడితి తాగ‌దు, మేత మెయ్య‌దు, కానీ క‌డివెడు పాలు ఇస్తుంది.
 ఏంట‌ది?

తాటిచెట్టు

66. అన్నకు అందవు కాని తమ్ముడికి అందుతాయి?

పెదవులు

67. స‌న్న‌టి స్థంభం, ఎవ్వ‌రూ ఎక్క‌లేరు, దిగ‌లేరు ఏంట‌ది? పుటుక్కు ఏమిట‌ది?

సూది

68. మతము కాని మతము, ఏమి మతము?

కమతము

69. అగ్గిపెట్టెలో ఇద్ద‌రు పోలీసులు ఏంట‌ది?రిందో పుటుక్కు ఏమిట‌ది?

వేరుశ‌న‌గ కాయ‌

70. రంగము కాని రంగము, ఏమి రంగము?

చదరంగము

71. ఇంట్లో మొగ్గ బ‌య‌ట‌కొస్తే పువ్వు?

గొడుగు

72. మేమిద్దరం మిమ్మల్ని మోస్తాము, మీ అవసరము తీరాక
 మూలన పడుకుంటాము?సొక్కు జారిందో పుటుక్కు ఏమిట‌ది?

చెప్పులు

73. కాళ్ళున్నా పాదాలే లేనిది ఏంట‌ది?

కుర్చీ

74. రాయి కాని రాయి, ఏమి రాయి?

కిరాయి

75. చ‌క్క‌న‌మ్మ చిక్కినా అందంగా ఉంటుంది?

స‌బ్బు

76. బంగారు బిడ్డలు, వెచ్చని దుస్తులు, గుర్రపు వెంట్రుకలు?

మొక్కజొన్న

77. ప‌చ్చ‌ని పాముకు తెల్ల‌ని చార‌లు?

పొట్ల‌కాయ‌

78. రణము కాని రణము, ఏమి రణము?

చరణము

79. నాలుగు క‌ర్ర‌ల మధ్య న‌ల్ల‌రాయి?

క‌ళ్ల‌జోడు

80. మనిషి మనిషి మధ్య రథ సారథి నేను, నేను లేకుంటే ప్రపంచమే లేదు?

ప్రేమ