PODUPU KATHALU

PODUPU KATHALU IN TELUGU │ Page-2

41. అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు త్రాగుతుంది ?

దీపం వత్తి

42. కాళ్లు లేవు గానీ నడుస్తుంది. కళ్లు లేవు గానీ ఏడుస్తుంది?

మేఘం

43. కడుపు నిండా రాగాలు, వంటి నిండా గాయాలు?

మురళి

44. ఓహొయి రాజా! ఒడ్డు పొడుగేమి? పట్టుకోబోతే పిడికెడు లేవు?

పొగ

45. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు?

ఉల్లి

46. రాజుగారి తోట‌లో రోజాపూలు చూచేవారేగాని, లెక్క‌వేసేవారు కాదు ఏమిట‌వి?

చుక్క‌లు

47. సముద్రంలో పుట్టిపెరిగి ఊరిలో అరుస్తుంది, ఏమిటది?

శంఖం

48. అడ‌విలో పుట్టింది, అడ‌విలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైత‌క్క లాడింది ?

చిల్ల క‌వ్వ‌

49. నీళ్లు నుంచి వస్తుంది. నీకు నాకూ రుచిస్తుంది? ఇంత‌కీ ఏమిట‌ది?

సాల్ట్‌

50. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు ?

నిప్పు

51. ఆకాశంలో పాములు ఏంట‌వి?

పొట్ల‌కాయ‌లు

52. విత్తనం లేకుండా మొలిచేది?

గడ్డము

53. ఆకులు లేని అడ‌విలో జీవం లేని జంతువు, జీవాల‌ను వేటాడుతుంది ఏంట‌ది?

దువ్వెన‌

54. వారు కాని వారు, ఏమి వారు?

నవారు

55. వీధిరాజుకు కొప్పుది కానీ జుట్టు లేదు, క‌ళ్ళున్నాయి కానీ చూపులేదు ఏంట‌ది?

కొబ్బ‌రికాయ‌

56. నూరుగురు అన్నా తమ్ముళ్లకు ఒకటే మొలతాడు?

చీపురు

57. ఆరు ఆమ‌డ‌ల నుండి అల్లుడు వస్తే అత్త‌గారు వ‌డ్డించింది. విత్తులేని కూర ఏంట‌ది?

పుట్ట‌గొడుగుల కూర‌

58. రోజుకో ఆకారం మారుస్తాడు, చివరకు నిండు సున్నా అవుతాడు?

చంద్రుడు

59. తెల్ల‌టి పొలంలో న‌ల్ల‌టి విత్త‌నాలు,చేతితో చ‌ల్లుతాం, నోటితో ఏరుతాం ఏమిట‌వి?

పుస్త‌కంలో అక్ష‌రాలు

60. అన్నదమ్ములు ఇద్దరు, ఒకరు ఎంత దూరం పోతే, రెండవ వారు అంతే దూరం పోతారు?

కాళ్ళు