Podupu Kathalu in Telugu
పొడుపు కథలు

1. చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది?
2. నూరు పళ్ళు, ఒకటే పెదవి.
3. జాన కాని జాన, ఏమి జాన?
4. పైన చూస్తే పండు, పగుల గొడితే బొచ్చు?
5. తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది?
6. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు, అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు?
7. లాగి విడిస్తేనే బ్రతుకు?
8. జానెడు ఇంట్లో, మూరెడు కర్ర?
9. పువ్వులో అందరికీ పనికి వొచ్చే పువ్వు?
10. తొలు తియ్యన, గుండు మింగన్నా?
11. పెద్ద ఇంటిలో పొట్టివన్ని నిలబెడితే నిండా నేనే?
12. పెద్ద ఇంటిలో పొట్టివన్ని నితొలుతో చేస్తారు. కర్రతో చేస్తారు.
అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు?
13. పొద్దుటూరి చెట్లలో పొదిలింది చెళవాయి,
చూసే వారే కాని పట్టే వారు లేరు?
14. దాని పువ్వు పూజకు రాదు.
దాని ఆకు దొప్పకు రాదు, దాని పండు అందరు కోరు?
15.మూత తెరిస్తే, ముత్యాల పేరు?కోరు?
16. నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది?
17. మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు?
18. తల నుండి పొగ చిమ్ముంది, భూతం కాదు. కన్నులెర్రగా ఉండు రాకాసి కాదు.
పాకిపోవుచుండు పాము కాదు?
19. మొగ్గ కాని మొగ్గ, ఏమి మొగ్గ?
20. చూసే చిన్నోడు, వాడి ఒంటి నిండా నార బట్టలు?