
DeepSeek అనే చైనీస్ AI యాప్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది.. ఇది US, UK, మరియు చైనాలో Apple App Storeలో టాప్-రేటెడ్ యాప్‌గా నిలిచింది. జనవరిలో లాంచ్ అయిన ఈ యాప్, AI పరిశ్రమలో అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తోంది. DeepSeek-V3 ఓపెన్-సోర్స్ మోడల్‌గా అభివృద్ధి చేయబడింది. దీని అభివృద్ధికి కేవలం $6 మిలియన్ల ఖర్చు అయ్యిందని కంపెనీ పేర్కొంది. ఇది చాట్‌జీపీటీ మాదిరిగానే మ్యాథ్స్, కోడింగ్, మరియు నేచురల్ లాంగ్వేజ్ రీజనింగ్ వంటి టాస్క్‌లలో సమర్థంగా పని చేస్తుంది. ఈ App తక్కువ ఖర్చుతో కూడిన మోడల్ను రూపొందించి పరిశ్రమను ఆశ్చర్యపరిచింది.
2021 నుంచి అమెరికా చైనాకు అధునాతన చిప్‌ల విక్రయంపై ఆంక్షలు విధించింది. అయితే, చైనీస్ AI అభివృద్ధికర్తలు కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేస్తూ తక్కువ కంప్యూటింగ్ పవర్‌తో కూడిన మోడళ్లను రూపొందిస్తున్నారు. ఇది తక్కువ ఖర్చుతో తయారవ్వడంతో, ఇతర AI కంపెనీల లాభాలకు సవాలుగా మారింది.

2023లో హాంగ్‌జౌ నగరానికి చెందిన లియాంగ్ వెన్‌ఫెంగ్ Deep Seekను స్థాపించారు. ఆయన Nvida A100 చిప్‌లను నిల్వచేసి, చౌక ధరల చిప్‌లతో అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషించారు. Deep Seek లాంచ్‌తో Nvidia, Microsoft, మరియు Meta వంటి కంపెనీల షేర్ల ధరలు తగ్గాయి. యూరప్ మార్కెట్‌లో కూడా ఈ ప్రభావం కనిపించింది
DeepSeek భవిష్యత్ దిశ :
Deep Seek లాంటి తక్కువ ధర మోడళ్ల వల్ల విజయవంతమైన అభివృద్ధి, AI పరిశ్రమకు కొత్త దిశలను తెరవనుంది. కానీ, చిప్ టెక్నాలజీలో మరియు అధునాతన AI టెక్నాలజీలో అగ్రరాజ్యం అమెరికా యొక్క ఆధిపత్యం కనపడుతుంది. ప్రస్తుతం deep seek తోని చైనీస్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తోంది