HANUMAN CHALISA LYRICS IN TELUGU ┃ హనుమాన్ చాలిసా తెలుగులో!

WhatsApp Group Join Now

HANUMAN CHALISA హనుమంతుడిని పొగిడే పవిత్రమైన భక్తి గీతం. ఇది గోస్వామి తులసీదాస్ రాసిన రామచరిత మానస్ లో భాగంగా 16వ శతాబ్దంలో రాయబడింది. 40 చౌపాయిలతో (శ్లోకాలు) కూడిన ఈ చలీసా హనుమంతుని కీర్తిని, భక్తులపై ఆయన అనుగ్రహాన్ని వివరిస్తుంది.

దోహా

శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥

ధ్యానం

అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహమ్ ।
దనుజ వన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్ ॥
సకల గుణ నిధానం వానరాణా మధీశమ్ ।
రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి ॥

గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।
రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥

మనోజవం మారుత తుల్యవేగమ్ ।
జితేంద్రియం బుద్ధి మతాం వరిష్టమ్ ॥
వాతాత్మజం వానరయూథ ముఖ్యమ్ ।
శ్రీ రామ దూతం శిరసా నమామి ॥

చౌపాఈ

జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ।
జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ 1 ॥

రామదూత అతులిత బలధామా ।
అంజని పుత్ర పవనసుత నామా ॥ 2 ॥

మహావీర విక్రమ బజరంగీ ।
కుమతి నివార సుమతి కే సంగీ ॥3 ॥

కంచన వరణ విరాజ సువేశా ।
కానన కుండల కుంచిత కేశా ॥ 4 ॥

హాథవజ్ర ఔ ధ్వజా విరాజై । [ఔరు]
కాంథే మూంజ జనేవూ సాజై ॥ 5॥

శంకర సువన కేసరీ నందన । [శంకర స్వయం]
తేజ ప్రతాప మహాజగ వందన ॥ 6 ॥

విద్యావాన గుణీ అతి చాతుర ।
రామ కాజ కరివే కో ఆతుర ॥ 7 ॥

ప్రభు చరిత్ర సునివే కో రసియా ।
రామలఖన సీతా మన బసియా ॥ 8॥

సూక్ష్మ రూపధరి సియహి దిఖావా ।
వికట రూపధరి లంక జలావా ॥ 9 ॥

భీమ రూపధరి అసుర సంహారే ।
రామచంద్ర కే కాజ సంవారే ॥ 10 ॥

లాయ సంజీవన లఖన జియాయే ।
శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ 11 ॥

రఘుపతి కీన్హీ బహుత బడాయీ (ఈ) ।
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥ 12 ॥

సహస్ర వదన తుమ్హరో యశగావై ।
అస కహి శ్రీపతి కంఠ లగావై ॥ 13 ॥

సనకాదిక బ్రహ్మాది మునీశా ।
నారద శారద సహిత అహీశా ॥ 14 ॥

యమ కుబేర దిగపాల జహాం తే ।
కవి కోవిద కహి సకే కహాం తే ॥ 15 ॥

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా ।
రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥

తుమ్హరో మంత్ర విభీషణ మానా ।
లంకేశ్వర భయే సబ జగ జానా ॥ 17 ॥

యుగ సహస్ర యోజన పర భానూ ।
లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 18 ॥

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 19 ॥

దుర్గమ కాజ జగత కే జేతే ।
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥

రామ దుఆరే తుమ రఖవారే ।
హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥

సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।
తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22 ॥

ఆపన తేజ సమ్హారో ఆపై ।
తీనోం లోక హాంక తే కాంపై ॥ 23 ॥

భూత పిశాచ నికట నహి ఆవై ।
మహవీర జబ నామ సునావై ॥ 24 ॥

నాసై రోగ హరై సబ పీరా ।
జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥

సంకట సే హనుమాన ఛుడావై ।
మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥

సబ పర రామ తపస్వీ రాజా ।
తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥

ఔర మనోరథ జో కోయి లావై ।
తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥

చారో యుగ ప్రతాప తుమ్హారా ।
హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29 ॥

సాధు సంత కే తుమ రఖవారే ।
అసుర నికందన రామ దులారే ॥ 30 ॥

అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా ।
అస వర దీన్హ జానకీ మాతా ॥ 31 ॥

రామ రసాయన తుమ్హారే పాసా ।
సదా రహో రఘుపతి కే దాసా ॥ 32 ॥

తుమ్హరే భజన రామకో పావై ।
జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ 33 ॥

అంత కాల రఘుపతి పురజాయీ । [రఘువర]
జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥

ఔర దేవతా చిత్త న ధరయీ ।
హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥

సంకట క(హ)టై మిటై సబ పీరా ।
జో సుమిరై హనుమత బల వీరా ॥ 36 ॥

జై జై జై హనుమాన గోసాయీ ।
కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37 ॥

యహ శత వార పాఠ కర కోయీ । [జో]
ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38 ॥

జో యహ పడై హనుమాన చాలీసా ।
హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39 ॥

తులసీదాస సదా హరి చేరా ।
కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40 ॥

దోహా

పవన తనయ సంకట హరణ – మంగళ మూరతి రూప్ ।
రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ ॥
సియావర రామచంద్రకీ జయ । పవనసుత హనుమానకీ జయ । బోలో భాయీ సబ సంతనకీ జయ ।

Hanuman Chalisa in telugu lyrics
HANUMAN CHALISA IN TELUGU LYRICS

History and Improtance of hanuman chalisa ┃ హనుమాన్ చాలీసా చరిత్ర

TULASI DAS WRITING HANUMAN CHALISA
Coutesy wikipedia

హనుమాన్ చాలీసా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇది 16వ శతాబ్దంలో సంత్ తులసీదాస్ గారు రచించిన ప్రసిద్ధ భక్తి గీతం. ‘చాలీసా’ అంటే హిందీలో నలభై అని అర్థం, కాబట్టి ఇది 40 చరణాలతో ఉంటుంది. ఈ గీతంలో హనుమంతుడి శక్తి, ధైర్యం, జ్ఞానం, భక్తి వంటి గుణాలను ప్రశంసిస్తారు.

హనుమాన్ చాలీసా రామాయణంలోని కథలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరిస్తుంది. దీన్ని పఠించడం ద్వారా భక్తులు హనుమంతుడి అనుగ్రహాన్ని పొందగలరని నమ్మకం. అదనంగా, ఇది మనసుకు శాంతిని, ధైర్యాన్ని అందిస్తుంది.

ఈ గీతం పలు ప్రసిద్ధ గాయకుల ద్వారా ఆలపించబడింది, ఉదాహరణకు హరి ఓం శరణ్, అనూప్ జలోటా, పండిట్ జస్రాజ్ వంటి వారు. అంతేకాక, హనుమాన్ చాలీసా అనేక హిందీ సనిమాల్లో కూడా కనపడుతుంది , ఉదాహరణకు ‘1920’ మరియు ‘బజరంగీ భాయీజాన్’ చిత్రాల్లో కూడా ఇది వాడబడింది.

సాధారణంగా, భక్తులు మంగళవారం లేదా శనివారం రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠిస్తారు, ఎందుకంటే ఈ రోజులు హనుమంతుడికి ప్రత్యేకమైనవిగా భావిస్తారు. దీన్ని పఠించడం ద్వారా భక్తులు తమ బాధలను, భయాలను తొలగించుకోవచ్చని నమ్ముతారు.

హనుమాన్ చాకలిసా – నియమాలు

  • Hanuman Chalisa గోస్వామి తులసీదాస్ హనుమంతుని దర్శనంతో హనుమంతుని స్తుతిస్తూ పాడిన స్తోత్రము.
  • ఈ స్తోత్రాన్ని మంగళ, శని, గురు వారాలలో ఉదయం మరియు రాత్రి వేళలో చదివితే మంచిది.
  • Hanuman Chalisaను శ్రద్ధతో పఠించటం వల్ల ఆర్థిక సంబంధిత సమస్యలు తొలగి మనశ్శాంతి, మనోబలం పెరుగుతాయి.
  • విపత్తు సమయాలలో, శుభ ముహుర్తాలలో (మృగశిర నక్షత్రం రోజుల్లో) 108 సార్లు, రోజూ 11 సార్లు చదవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
  • Hanuman Chalisa పఠనం చేస్తున్నప్పుడు ప్రతి పదాన్ని స్పష్టంగా, తప్పులు లేకుండా ఉచ్ఛరించాలి. మౌనంగా చదవడం కన్నా స్పష్టంగా శబ్దంతో పఠించడం ఎక్కువ ప్రభావితం చేస్తుంది.
  • Hanuman Chalisaను ఎప్పుడైనా చదవచ్చు కానీ ఉదయం 4-5 గంటల మధ్య అంటే బ్రహ్మ ముహూర్తంలో పఠించడం ఉత్తమం..
  • హనుమాన్ చలీసాను నిరంతరం 7 రోజుల లేదా 21 రోజుల పాటు పఠిస్తే మన కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం.
  • హనుమంతుడు బ్రహ్మచారి కావడంతో మాంసాహారం, మద్యం మరియు తామసిక ఆహారం తినకూడదు.
  • మహిళలు పిరియడ్స్ సమయంలో హనుమాన్ చలీసా పఠించకూడదు. అలాగే, హనుమంతుడిని తల వంచి నమస్కరించకూడదు, ఎందుకంటే ఆయన ప్రతి మహిళను తల్లిలా చూస్తాడు.

Also Read : Castor Oil for Better Skin: ఆముదం చర్మానికి మంచిదా ? ఎలా ఉపయోగించాలి ?

Also Read : Jowar: జొన్నలు తింటే.. గుండెకే కాదు, షుగర్‌ పేషెంట్స్‌కూ మంచిది..!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top