JAYALALITHA JEWELLERY – ఆస్తులపై కోర్టు తీర్పు, తమిళనాడు ప్రభుత్వానికి స్వాధీనం

WhatsApp Group Join Now

తమిళనాడు మాజీ సీఎం జయలలిత పేరు వినగానే రాజకీయ చరిత్ర, సంపద, వివాదాలు గుర్తొస్తాయి. ఆమెపై ఆదాయ కేసు (Disproportionate Assets Case) 2014లో పెట్టబడింది. దోషిగా తేలడంతో, ఆస్తులను అధికారికంగా స్వాధీనం చేసుకున్నారు. అయితే, 2016లో ఆమె మరణించిన తర్వాత ఈ కేసు చుట్టూ మరిన్ని చట్టపరమైన వాదనలు వినిపించాయి.

ఆస్తుల స్వాధీనం – కోర్టు తుది తీర్పు

Jayalalitha Jewellery Ornaments
Jayalalitha Jewellery Ornaments
Source : Barandbench.com

ఈ వివాదంపై సుప్రీం కోర్టు ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని CBI ప్రత్యేక కోర్టు జయలలితకు చెందిన అన్ని ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలనే ఆదేశాలు ఇచ్చింది.
27 కిలోల బంగారు ఆభరణాలు – వీటిలో రెండు బంగారు కిరీటాలు, బంగారు తల్వార్ ఉన్నాయి.
1,526 ఎకరాల భూమి పత్రాలు – ఇవన్నీ జయలలిత మరియు ఆమె సహ నిందితుల పేర్లపై ఉన్నవి.
విలువైన వస్తువులు – ఇందులో జయలలిత ముఖాకృతి రూపంలో తయారుచేసిన బంగారు ఆభరణం, భారీ మొత్తంలో నగదు ఉన్నాయి.

కోర్టు ఏమంది?

జయలలిత మేనల్లుడు జె.దీపక్, మేనకోడలు జె .దీపా ఈ ఆస్తులపై తమకు హక్కు ఉందని కోర్టును ఆశ్రయించారు. కానీ సుప్రీం కోర్టు వారి అభ్యర్థనను తిరస్కరిస్తూ, “ఆస్తులు అక్రమ మార్గంలో సంపాదించబడ్డాయి, కాబట్టి ప్రభుత్వానికే చెందాలి” అని తీర్పు ఇచ్చింది. ఇంకా కోర్టు ఏమందంటే :

📌 జయలలిత మరణంతో కేసును నిలిపివేశారని, దోషి కాదని అనుకోకూడదు
📌 అక్రమ సంపాదనతో వచ్చిన ఆస్తులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి
📌 ఈ ఆస్తులను ప్రైవేట్ వారసులకు అప్పగించే అవకాశం లేదు.

ఇప్పుడీ ఆస్తుల భవిష్యత్తు ఏమిటి?

Jayalalitha Jewellery Ornaments
Jayalalitha Jewellery Ornaments
Source : Barandbench.com

ఈ భారీ ఆస్తులను తమిళనాడు ప్రభుత్వం ఏమి చేయబోతోందో ఆసక్తిగా మారింది.వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు డబ్బు సమకూరుస్తుందా లేదా బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్‌కి పంపిస్తుందా ?. ప్రాసిక్యూటర్ కిరణ్ జావలి మాట్లాడుతూ, “ఈ ఆస్తులు ప్రభుత్వానికి చెందినవే. ప్రభుత్వం వీటిని వేలం వేసి, వచ్చిన ఆదాయాన్ని వినియోగించుకోవచ్చు.” అని అన్నారు.

ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు

🔹 చెన్నైలో పార్క్ చేసి ఉన్న లగ్జరీ బస్సును కూడా కోర్టు స్వాధీనం చేసుకుంది!
🔹 ఈ కేసు 1996లో మొదలై, 18 ఏళ్ల పాటు కొనసాగింది.
🔹 చివరికి, ఈ తీర్పుతో జయలలిత ఆస్తుల వివాదానికి తెరపడినట్టే!

జయలలిత సంపద, రాజకీయం, వారసత్వం… అన్నీ వివాదాస్పదమే. కానీ ఆమె ఆస్తులు ప్రభుత్వానికి వెళ్లడం, రాజకీయ నాయకుల అక్రమ సంపాదనపై పెద్ద చర్చను తెరమీదికి తెచ్చింది. ఈ ఆస్తులను వేలం వేయాలా? లేక ప్రభుత్వ ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలా? జయలలిత అభిమానులు ఈ తీర్పును ఎలా స్వీకరిస్తారో? కామెంట్స్‌లో మీ అభిప్రాయాలను పంచుకోండి.

Also Read : Aashiqui 3 NEW TEASER: KARTIK AARYAN & SREELEELA కొత్త కథలో రాక్‌స్టార్ జోడీ!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top