జీర్ణ సమస్యలు గుండెపోటును పెంచుతుందా? ఈ రెండింటికీ లింకేంటి?

SAITEJA

జీర్ణ సమస్యలు గుండెపోటుకు కారణం కానప్పటికీ, కొన్ని జీర్ణ సంబంధిత లక్షణాలు గుండెపోటు లక్షణాలను పోలి ఉంటాయి, దీనివల్ల గందరగోళం ఏర్పడుతుంది. అంతేకాకుండా, కొన్ని జీర్ణ సమస్యలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది ప్రత్యక్ష కారణ సంబంధం కంటే బహుళ అంశాల మీద ఆధారపడి ఉంటుంది.

కాబట్టి ఈ రెండింటి మధ్య సంబంధాన్ని వివరంగా తెలుసుకుందాం.. గుండెపోటు – జీర్ణ సమస్యల మధ్య సారూప్య లక్షణాలు: గుండెపోటు, గుండెల్లో మంట (heartburn) రెండూ ఛాతీలో నొప్పిని కలిగిస్తాయి. గుండెల్లో మంట అనేది కడుపులోని ఆమ్లాలు అన్నవాహికలో పైకి వచ్చినప్పుడు వస్తుంది. ఛాతిలో మంటగా, నొప్పిగా అనిపిస్తుంది. ఈ నొప్పి గుండెపోటు నొప్పిని పోలి ఉండవచ్చు. గుండెపోటు , అజీర్ణం రెండూ వికారం, వాంతులను కలిగిస్తాయి. కొన్నిసార్లు కొన్నిసార్లు కడుపు నొప్పి గుండెపోటుకు సంకేతంగా ఉండవచ్చు. Also Read “చలికాలంలో విటమిన్-డీ లోపం.. ఈ ఆహారాలతో మాయం!” జీర్ణ సమస్యలు గుండెపోటు ప్రమాదాన్ని ఎలా పెంచుతాయి: కొన్ని జీర్ణ సంబంధిత సమస్యలు, ముఖ్యంగా కాలేయ మరియు పిత్తాశయ సమస్యలు, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు ప్రధాన కారణం. అంతే కాకుండా జీర్ణ సమస్యల కారణంగా ఆహారపు అలవాట్లు మారడం, జీవక్రియ మందగించడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. ఊబకాయం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. జీర్ణ సమస్యలు మధుమేహానికి దారితీయవచ్చు, ఇది గుండె జబ్బులకు ఒక ముఖ్యమైన ప్రమాద కారకం. గుండెపోటు లక్షణాలు: జీర్ణ సమస్యలతో సంబంధం లేకుండా, గుండెపోటు ముఖ్య లక్షణాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. వాటిల్లో ముఖ్యంగా ఛాతీలో ఒత్తిడి, బిగుతు, నొప్పి లేదా మంట, చేతులు, భుజాలు, మెడ, దవడకు నొప్పి వ్యాపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, చెమటలు పట్టడం, వికారం,వాంతులు వంటి లక్షణాలు కన్పిస్తాయి. జీర్ణ సమస్యలను ఎలా నివారించాలి: జీర్ణ సమస్యలను తగ్గించుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు , ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ధూమపానం , మద్యపానం మానుకోండి. ఒత్తిడిని తగ్గించుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. అయితే మీకు గుండెపోటు లక్షణాలు ఉంటే, వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ఇది గుండెపోటు కాదా అని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.

Read more at: https://telugu.oneindia.com/health/do-digestive-problems-increase-the-risk-of-heart-attack-417649.html

Leave a Comment