
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం 2023లో విడుదలై భారీ విజయాన్ని సాధించిందని అందరికి తెల్సిందే . దాని తర్వాత వీక్షకులకోసం దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ జైలర్ సీక్వెల్ అయిన ‘జైలర్ 2’ను విడుదల చేసే పనిలో పడ్డారు . ఈ సీక్వెల్ షూటింగ్ 2025 మార్చి నుండి ప్రారంభం కానుందని సమాచారం.
2024లో జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకుడు నెల్సన్ ‘జైలర్ 2‘ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అనంతరం 2025 జనవరి 14న సంక్రాంతి సందర్భంగా మంగళవారం ఈ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సీక్వెల్ సంబందించిన అనౌన్స్మెంట్ టీజరును విడుదల చేసారు. ఈ వీడియోలో గోవాలో నెల్సన్ మరియు సంగీత దర్శకుడు అనిరుధ్ కాలక్షేపం చేస్తూ కనిపిస్తారు. అయితే, అదే సమయంలో తుఫానుల ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ కనపడతారు

ఈ చిత్రంలో రమ్యకృష్ణన్, తమన్నా, వసంత్ రవి, యోగి బాబు, మిర్నా మేనన్ మరియు సునీల్ ప్రధాన పాత్రల్లో నటించగా, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, కిషోర్ మరియు మకరంద్ దేశ్‌పాండే ప్రత్యేక పాత్రల్లో ఆకట్టుకున్నారు.
ప్రస్తుతం రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, సత్యరాజ్, ఉపేంద్ర, శృతి హాసన్, మరియు సౌబిన్ సహిర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
Super marvelous website
Great website 😁